calender_icon.png 4 February, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనానికి పాల్పడిన దొంగ అరెస్టు..

04-02-2025 04:42:12 PM

జానకి షర్మిల, ఏఎస్పి అవినాష్ కుమార్..

బైంసా (విజయక్రాంతి): బైంసాలోని ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగను పట్టణ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ఏఎస్పి అవినాష్ కుమార్ తో కలిసి విలేకరులకు చోరీ వివరాలను వెల్లడించారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ సిందే (36) సరిహద్దు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బాలరాంపూర్ లో ఉంటూ కొన్ని మాసాలుగా బైంసాలోని నరసింహ, సంతోష్ మాత, హనుమాన్, బాలాజీ మందిర్ లలో, హిమ వైన్స్ లో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన ఆభరణాలను భార్య పూజా షిండే సహకారంతో మహారాష్ట్రలోని వెండి వ్యాపారి పాండురంగ రామారావుకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. బైంసా పోలీసులు కేసులు నమోదు చేసి విజయ్ సిండెను చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 3.150  కిలోల వెండి, 3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. మిగతా ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.