calender_icon.png 16 April, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19.9 తులాల బంగారం చోరీ చేసిన దొంగ అరెస్ట్

15-04-2025 12:46:26 AM

- విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ

ఇల్లెందు, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): గత రెండు రోజుల క్రితం ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలో ఓఇంట్లో 19.9 తులాల బంగారం చోరీకి గురి అయింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో ముమ్మురంగా గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం పట్టణంలోని బుగ్గ వాగు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్ ఉప్పుగూడ కు చెందిన కోరి రాహుల్ (23) అనే వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న విషయాన్ని పోలీసులు గమనించి అతన్ని విచారిస్తున్న క్రమంలో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బ్యాగులో 19.9 తులాల బంగారం, 20 తులాల వెండి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి పూర్తిస్థాయిలో విచారించగా 11 వ తారీకు అర్ధరాత్రి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో చోరీ చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను విలేకరుల సమావేశంలో  తెలిపారు.

నిందితుడి పై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలు శిక్ష సైతం అనుభవించాడని తెలిపారు. అనతి కాలంలోనే భారీ చోరీని ఛేదించిన ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ ను, ఎస్‌ఐలు నాగుల్ మీరా పఠాన్, సూర్యం, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. 19.9 తులాల బంగారం చోరీ విషయంలో సమయస్ఫూర్తితో చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులకు రూ. 1000 రివార్డును ఇల్లందు డీఎస్పీ చంద్రబాను అందజేశారు