calender_icon.png 26 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్ నుంచి దట్టమైన పొగలు

26-02-2025 01:00:11 AM

ఉక్కిరి బిక్కిరి అవుతున్న కూన్య తండా వాసులు 

మహబూబాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): డంపింగ్ యార్డ్ నుంచి దట్టమైన పొగలు,ధూళి,దుమ్ము, దుర్వాసన రావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మహబూబాబాద్ జిల్లా  మరిపెడ మున్సిపాలిటీ కున్య తండా వాసులు.

సోమవారం సాయంత్రం డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న పొగతో తండావాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఈ విషయానికి సంబంధిత అధికారులకు రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు వినిపించుకున్న పట్టించుకోవడం లేదన్నారు. అంతకుముందు ఇలానే డంపింగ్ యార్డ్ నుండి పోగొలతో తండా చుట్టూ ముట్టాయి.