ముంబై: భారత్, ఆసీస్ మధ్య త్వరలో జరగనున్న బోర్డర్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ, పంత్ గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశం ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్‌తో టెస్టు సిరీస్ ఎల్లప్పుడు రసవత్తరమే. ఈసారి కోహ్లీ, రోహిత్, పంత్‌లు సిరీస్‌లు కీలకం కానున్నారు. వీళ్లతో పాటు జైస్వాల్, గిల్, జడేజాలు కూడా ముఖ్యపాత్ర పోషించే అవకాశముంది. అయితే టీమిండియా లైనప్‌ను నిలువరించేందుకు మా బౌలింగ్ యూనిట్ సిద్ధంగా ఉంది. ’ అని లయన్ చెప్పుకొచ్చాడు. సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు పెర్త్ వేదికగా జరగనుంది. 2014 స్వదేశంలో ఆఖరుసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నెగ్గిన ఆసీస్ పదేళ్ల తర్వాత సిరీస్ గెలవాలని ఆశిస్తోంది.