10-03-2025 01:25:35 AM
జూనియర్ ఆసిస్టెంట్, సర్వేయర్లపై పలు ఆరోపణలు
సూర్యాపేట, మార్చి ౯ (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వ హిస్తున్న ఉద్యోగికి ప్రభుత్వం ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తోంది. కాని జిల్లాలో కొందరు ఉద్యోగులు కాసులకు కక్కుర్తీ పడుతున్నారు. చేయి తడిపినే పనులు మొదలు పెడుకున్నారు. ఈ తతంగం జిల్లా ల్యాండ్ సర్వే విభాగంలో పెరిగిపోయిందనే ఆరోపణలు గత కొన్ని రోజులుగా వినబడుతున్నాయి.
ఇద్దరు వ్యక్తులకు సంబందించిన భూ వివాదం పరిష్కరించేందుకు అధికారులు పారదర్శ కంగా సర్వే చేసి మ్యాపుల ఆధారంగా నిజమైన వ్యక్తులకు న్యాయం చేయాలి. కాని సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారులు పైనలిస్తే.. ప్రభుత్వ భూమినైనా సర్టీపై చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణకు గురైన భూములను గుర్తించడం, భూముల కు హద్దులు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ వంటివి ఈ శాఖ అధికారుల పని.
కానీ అక్రమ సంపా దను కోసం అడ్డదారి తొక్కున్నారని, భూస ర్వే కోసం ఆన్లున్ ద్వారా దరఖాస్తులు చేసు కున్నా వ్యక్తులకు నిబంధన ప్రకారం సర్వే చేయల్సిన సర్వేయర్లు పైసలిస్తేనే సర్వే చేస్తున్నారని, ఇందులో జిల్లా కార్యాల యంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పాత్ర అధికంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ శాఖలో ఓ జూని యర్ అసిస్టెంట్ సస్సెండ్ కావడం ఆ శాఖపై ఉన్న ఆరోపణలను నిజం చేస్తుంది.
అక్రమ వసూళ్లలో సర్వేయర్లు
కొత్త జిల్లాల ఏర్పాటు.. నూతన మండలాల విభజన జరగడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో భూముల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు సాధబైనామాల క్రమబద్ధీకరణ జరిగి, ధరణి పోర్టల్ అమలులోకి రావడంతో జిల్లాలో భూ వివాదాలు అధికంగా పెరిగాయి. దీంతో రెవెన్యూ అధికారులతో పాటు లాండ్ సర్వే అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధన ప్రకారం మీ సేవ ద్వారా ప్రభుత్వ రుసుము చెల్లించి సర్వే కు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు ఆన్లున్ దరఖాస్తుల క్రమపద్ధతిలో సదరు భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాతో సర్వే అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పైసలు ఇచ్చిన వారికే సర్వే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతే కాకుండా సర్వేయర్లు భూ సర్వే సమయంలో ప్రతి ఎకరాకు కొంత రేటు కట్టి వసూలు చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తున్నారని అంటున్నారు.
అంతా అతని చుట్టే
సూర్యాపేట జిల్లా ఏర్పాటు అయిన తరువాత ల్యాండ్ సర్వే కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన జిల్లా అధికారితో పాటు జూనియర్ అసిస్టెంట్ ఏండ్ల తరబడి విధులు నిర్వహించారు. ఇటీవల సాధారణ బదిలీలలో జిల్లా అధికారి బదిలీ కాగా జూనియర్ అసిస్టెంట్ మాత్రం ఇక్కడే పాతుకపోయారు. అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసెస్టెంట్ గత కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు వచ్చిన ఏలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
గతంలో విధులు నిర్వహించిన జిల్లా అధికారి అండడందలు పూర్తిగా ఉండటంతో అతని అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అంటున్నా రు. కార్యాలయంలో ఏ పని కావాలన్నా ఇతన్ని కలువల్సిందేననే ఆరోపణలు ఉన్నా యి.
కార్యాలయ పనుల కోసం వచ్చే వారి నుంచి అధికారి డ్రైవర్ తో కలిసి ఇతను వసూళ్లకు పాల్పడేవారని, ఇందులో అందరి కి వాటా ఉండేడని సమాచారం. అయితే అతన్ని గత కొద్ది రోజుల క్రితం కలెక్టర్ సస్పెండ్ చేయగా.. తిరిగి విదుల్లో చేరారు.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
సర్వే పనులకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. గతం లో జరిగిన విషయాలు మాకు తెలియ దు. సర్వే కొరకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతం సర్వే పనులు అంతగా సాగడం లేదు.
శ్రీనివాస్, జిల్లా ల్యాండ్, రికార్డ్స్ అధికారి