calender_icon.png 21 November, 2024 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లు నన్ను చంపేస్తారు

21-11-2024 12:20:24 AM

  1. తిండి కూడా పెట్టడం లేదు
  2. వీడియోలో ఏపీ మహిళ ఆవేదన

అమరావతి, నవంబర్ 20: యజమాని తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ కువైట్‌లో పని చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గార కుమారి అనే మహిళ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు సరిగా తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యజమాని నుంచి కాపాడి తన పిల్లల దగ్గరకు చేర్చే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు.

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె బంధు వులు, గ్రామస్తులు కుమారిని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల ని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కాగా, కాకినాడ జిల్లా యెల్లమెల్లి గ్రామానికి చెందిన కుమారికి రామవరానికి చెందిన వెంకటేష్‌తో 19ఏళ్ల క్రితం వివాహం అయింది.

ఈ క్రమంలోనే ఇద్దరు బాలికలు, ఓ అబ్బాయికి ఆమె జన్మనిచ్చారు. ఐదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో ఆమె ఏడు నెలల క్రితం కువైట్ వెళ్లారు. తాజాగా ఆమె తన యజమానులు చిత్రహింసలు పెడుతున్నారంటూ వీడియో విడుదల చేశారు.