calender_icon.png 16 November, 2024 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 ఏళ్లకే పెళ్లి చేస్తారట!

10-08-2024 12:33:38 AM

ఇరాక్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన

పార్లమెంట్‌లో పెళ్లి వయసు తగ్గించే బిల్లు

వ్యతిరేకిస్తోన్న మహిళా, మానవ హక్కుల సంఘాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: మహిళల హక్కుల కోసం అంతర్జాతీయంగా అనేక సంస్థలు గళమెత్తుతుంటే.. అమ్మాయిల పెళ్లి వయసుపై ఇరాక్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల హక్కులను కాలరాసే విధంగా దేశంలోని బాలికల పెళ్లి వయసును 9 ఏళ్లకు కుదించాలని పార్లమెంట్‌లో ఇరాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బిల్లును ఇరాక్ న్యాయ శాఖ పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది.

ఇప్పటివరకు ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందితే బాలికల వివాహ వయస్సు 9ఏళ్ల, బాలురు వయసు 15 ఏళ్లకు కుదిస్తారు. ఈ బిల్లుతో బాల్య వివాహాలు పెరిగే అవకాశముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వం, మహిళల హక్కుల పురోగతిని ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా, మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యతో పాటు ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలికల డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.