మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉంది
నూటికి నూరు శాతం మహిళలకు 2500, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యత మాది
ఆరు మండలాలలో 1692 మహిళా సంఘాలకు 15 కోట్ల 20 లక్షల బ్యాంకు లింకేజి రుణాలు
10 సంవత్సరాలలో ఎవరి బతుకులు బాగుపడలేదు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు (విజయక్రాంతి): అధికారంలోనైన ప్రతిపక్షంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి వైపే కొట్లాడుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో 1692 మహిళా సంఘాలకు 15 కోట్ల 20 లక్షల బ్యాంకు లింకేజి రుణాలు, 1184 మహిళా స్వయం సహాయక సంఘాలకు 46 లక్షల 72 వేల వడ్డీ లేని రుణాలు, 816 మహిళా సంఘాలకు 17 కోట్ల 32 లక్షల రుణాలను ప్రభుత్వం తరఫున అందజేశారు.
తెలంగాణ పిల్లలు ప్రాణాలు వదులుకుంటుంటే చలించి సోనియ గాంధీ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. పేద ప్రజలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయని స్వరాష్ట్ర కలను సహకారం చేసిందని అన్నారు. 10 సంవత్సరాలలో ఎవరి బతుకులు బాగుపడలేదు, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. మేము పదేళ్లు ఓపికపట్టాం, కానీ బిఆర్ఎస్ నాయకులు 1 సం.. రానికే ఎగిరెగిరి పడుతున్నారు. అధికారం కోల్పోయి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తాం అని అన్నారు. మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉంది, నూటికి నూరు శాతం మహిళలకు 2500, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యత మాది, మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
రాబోయే రోజుల్లో మహిళలకు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాం అని అన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రుణ సదుపాయం అందిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు ఉన్నారు.