calender_icon.png 22 April, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లే నాకు డ్రగ్స్ సరఫరా చేశారు

22-04-2025 12:00:00 AM

డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను స్థానిక పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా గా పోలీసుల విచారణకు హాజరైన ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. అయి తే, విచారణలో భాగంగా పోలీసులు ఆయన బ్యాంకు లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. అతని అకౌంట్ నుంచి చిన్న మొత్తాల్లో డబ్బు వేర్వేరు వ్యక్తులకు బదిలీ అయినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలోనే షైన్ టామ్ చాకోను ప్రశ్నించారు. అయితే, తాను అప్పుగా ఇచ్చానని చెప్పారట! ఈ సందర్భంగా చాకో పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

డ్రగ్స్ వినియోగించేవారు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రతిసారీ తన పేరే తెరపైకి వస్తోందని ఆయన తెలిపినట్టు సమాచారం. మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి కొంత మంది మధ్యవర్తులు ఉండేవారని.. వారి నుంచే తనకు డ్రగ్స్ వచ్చేవని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అడిగితే సినిమా సెట్స్‌కూ తీసుకువచ్చి ఇచ్చేవారని కూడా చెప్పినట్టు వార్తలు ప్రచురితమయ్యాయి.