calender_icon.png 28 January, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోచుకున్న డబ్బును దాచుకునేందుకు వెళ్లిండ్రు

25-01-2025 12:19:15 AM

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్ జనవరి 24 (విజయ క్రాంతి) : గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లి జల్సాలు చేసి దోచుకున్న డబ్బును దాచుకున్నందుకు మాత్రమే పర్యటనలు చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

తొమ్మిది సంవత్సరాలకాల వ్యవధిలో  కేవలం రూ 25,750 కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు ఒప్పందలు మాత్రమే జరిగాయని, కేటీఆర్ కేవలం షో పుట్ట రాజకీయాలు చేసింది మాత్రమే పనికి వస్తారని విమర్శించారు. ఇంగ్లీష్ లో మాట్లాడి హంగు హార్భాటాలు చేస్తే విదేశాల నుంచి కంపెనీలు రావని, ప్రజలకు మంచి చేయాలని తపన ఉన్నప్పుడు మాత్రమే కంపెనీలు వస్తాయని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 14 నెలల కాలవ్యవధిలోనే 219,182 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంత మాకే తెలుసు అనే కృత్రిమ ప్రపంచంలో బతుకుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, కేవలం కేటీఆర్ అహంకారం తో కూడిన అసహనం వ్యక్తం చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డిసిసి  ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మీడియా ప్రచార కార్యదర్శి బెనహర్ ఉన్నారు.