09-02-2025 01:44:17 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పెద్దలు భావించారు. సంబురాలు చేసుకునేందుకు ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు.
తీరా శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. ఆ పార్టీ కనీసం ఖాతా అయినా తెరవలేదు. దీంతో హస్తినాపురికి ఉత్సాహంగా వెళ్లి న నేతలంతా ఉసూరుమంటూ తిరిగి భాగ్యనగరానికి చేరుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవ హరించి, ప్రజల మద్దతు పొందకపోతే మళ్లీ అధికారాన్ని చేపట్టడం కష్టతరమని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా రు.
గతంలో సుదీర్ఘ కాలం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రె స్ పార్టీకి ప్రజలు కనీసం ఒక్క సీటైనా కట్టబెట్టకపోవడాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ కళ్లు తెరిచి, ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని సూచిస్తున్నారు. ఢిల్లీ ఎన్నిక ల ఫలితాలు దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు హెచ్చరికలుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు.
తెలంగాణలో బీజేపీకి అధికారం కల్ల
ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూసి బీజేపీ సంబురపడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మా పార్టీకి శ్రీరామరక్ష. ఇక్కడ బీజేపీ అధికారం కల్ల. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లోనూ కేంద్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుంది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్