26-04-2025 12:25:22 AM
స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు జనం ఆసక్తి
కెసిఆర్ ప్రసంగం కోసం తెలంగాణ ఎదురుచూస్తుంది
రేపటి రజితోత్సవం తెలంగాణ పండుగలా చేద్దాం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : జనం గుండెలో చెరగని ముద్ర వేసుకున్న బీర్ ఎస్ ఆవిర్భావ సభ అంటే అదిరిపోయేలా ఉండాలని వాహనాల లెక్క తగ్గకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని, ప్రజల ముందుగానే గమనించారని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బి ఆర్ ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలిపారు.
వరంగల్ లో జరగనున్న టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు భారీ ఎత్తున ప్రజలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఒక కష్టం కాదని ప్రతి విషయంలోనూ అష్ట కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కష్టాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఎంతో ఉన్నత స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిందని తెలిపారు.
గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిములు, మాజీ జడ్పీటీసీ లు వెంకటేశ్వరమ్మ, నరేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ రెహమాన్ తదితరులు ఉన్నారు.