మల్లికా శెరావత్ బోల్డ్ బ్యూటీగా అన్ని పరిశ్రమల ప్రేక్షకులకూ సుపరిచతమే. కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మల్లిక తిరిగి ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో‘ చిత్రంతో వెండితెరపై అలరించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లిక ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం దక్షిణాదికి చెందిన డైరెక్టర్ ఆమెను సంప్రదించగా కుదరదని చెప్పేశారట.
అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మల్లిక ఇంటర్వ్యూలో వివరించారు. “ఒక సౌత్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చేయాలన్నారు. అందులో మీరు చాలా హాట్‌గా కనిపించాలన్నారు. సరే అన్నాను. నన్నెలా ఆ పాటలో చూపిస్తారని అడిగాను. నడుముపై చపాతీలు కాలుస్తామన్నారు. వెంటనే కుదరదని చెప్పేశా. అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది” అని మల్లిక తెలిపారు.