calender_icon.png 3 February, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు

03-02-2025 01:31:07 AM

* రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారు

* ఇది ప్రజలను వేధించే పాలన

* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని.. ఏడాది కాంగ్రెస్ పాలన లో ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారని ఎక్స్ వేదికగా తెలిపారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసు రు తీసుకుంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో సాగునీళ్లు లేక, కరెంట్ రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.

ఇది ప్రజాపాలన కాద ని.. ప్రజలను వేధించే పాలన అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మేల్కొనాల్సిన సమ యం వచ్చిందని పిలుపునిచ్చారు.