26-03-2025 12:53:46 AM
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్
కొత్తపల్లి, మార్చి 25: బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు వి ఇచ్చిన ఇంకా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దూబల శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ కరీంనగర్లో నిర్వహించిన సన్నాహక సమావేశం లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపి పై, కేంద్ర మంత్రి బండి సంజయ్, అయోధ్య రామ మందిర అక్షింతలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రతి సారి హిందువుల మనోబాలు దెబ్బతినేలా వాక్యలు చేయడం బాధాకరమన్నారు.కేటీఆర్ అయోద్య నుండి వచ్చినవి అక్షింతలు కావు, రేషన్ బియ్యం తెచ్చి అక్షింతల పేరుతో పంచి ప్రజలను మోసం చేశారని వాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఒక వర్గం ఓట్ల కోసం, మద్దతు కోసం యావత్తు హిందు సమాజాన్ని కించ పరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. కేటీఆర్ మీ వ్యాఖ్యలను హిందూ సమాజం గమనిస్తుందని హిందువుల మనోబాలను కించ పరుస్తే మీ పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.