నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం రాజేష్ బాబు తండాలో కిషన్ మారుతి అనే ఇద్దరు రైతులకు చెందిన వ్యవసాయ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుని తమకు భూమి కేటాయించడం లేదని ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం(Collector Office) వద్ద వారు చేస్తున్న ఆందోళన శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరుకున్న అధికారులు స్పందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.