దళితబందు ఖాతాలను ఫ్రీజ్ చేసిన కాంగ్రెస్
9న దళితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తా
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్, నవంబరు 6: దళితబంధు విషయంలో తన తల తెగినా దళితు లకు అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్‌లోని సుమారు 20 వేల కుటుంబాలను ఆదుకున్నారని చెప్పారు.
రెండవ విడత దళితబంధు డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అకౌంట్లను ఫ్రీజ్ చేసి దళితులను దగా చేస్తున్నదన్నారు. దళితబం రెండవ విడతను ఎందుకు ఆపుతున్నారో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న హుజూరాబాద్‌లోని తన ఇంటి వద్ద టెంట్ వేసుకొని దళితబంధు రెం డో విడత రాని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తానని చెప్పా రు.
దరఖాస్తులను కలెక్టర్ వద్దకు స్వయంగా తానే తీసుకువెళ్లి అందజేస్తానన్నారు. ఈ నెల 20లోపు రెండో విడత దళితబంధు ఇవ్వకుంటే కాంగ్రె స్ నాయకులను, ప్రజాప్రతినిధులను నియోజక వర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరిం చారు. మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు, కౌన్సిలర్లు ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, నరేష్, సదానందం, మారపల్లి సుశీల, ఇమ్రాన్ పాల్గొన్నారు.