23-02-2025 12:00:00 AM
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి): “నా దగ్గ ర డబ్బులు లేకే అసెంబ్లీ టికెట్టు ను లాక్కున్నారు” అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. శనివారం వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి వద్ద ఆయిల్ పాం కంపెనీ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో చిన్నా రెడ్డి మాట్లాడుతూ.. తనకున్న 80 ఎకరాల భూమిలో ఆయిల్‌పాం సాగు చేస్తున్నానని, దాని ద్వారా ఏటా కోటి 20 లక్షల ఆదాయం వస్తుందని.. ఇలా ఐదేండ్లు పంట ద్వారా వచ్చిన డబ్బుతో ఎలక్షన్‌లో పోటీ చేయొచ్చన్నారు.
ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే గతంలో వేలల్లో ఖర్చు అయ్యేవని ఇప్పుడు కోట్లలో ఖర్చు అవుతున్నాయన్నారు. తన దగ్గర డబ్బులు లేకనే ఇచ్చిన టిక్కెట్‌ను లాక్కున్నారని చెప్పారు.