- అంధకారంలో చాకలి ఐలమ్మ నగర్
- కరెంటు, నీటి సదుపాయం లేక అవస్థలు
- కలగానే మిగులిన సొంతిల్లు
జనగామ, డిసెంబర్ 2౯ (విజయక్రాంతి): జనగామ మున్సిపాలిటీ బాణాపు 11 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభు ఇందిరమ్మ పథకం కింద 1200 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కొందరు ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారు.
ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో అంతా తలకిందు బీఆర్‌ఎస్ డబుల్ బెడ్‌రూం పథకం తీసుకురావడంతో బాణాపురంలో పేదలకు ఇచ్చిన స్థలం లాక్కొని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. 500 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు చేపట్టగా.. అందులో సగం కూడా పూర్తి కాలేదు.
అంతకుముందు స్థలాలు పొందిన పేదలు సీపీఎం అండతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సీపీఎం పోరాటం ఫలితంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూం నిర్మాణాల పక్కన చాకలి ఐలమ్మ నగర్‌లో సుమారు పదెకరాల స్థలాన్ని కేటాయించింది. అధికారులు ఆందోళనకా చర్చలు జరిపి 1,200 మందిలో మొదటి విడత కింద 500 మందికి 80 గజాల చొప్పు స్థలాలు కేటాయించింది.
సొంత ఖర్చులతో ఇండ్ల నిర్మాణం
చాకలి ఐలమ్మ నగర్‌లో 500 మందికి అధికారులు టోకెన్లు ఇచ్చి స్థలాలు చూపించారు. 80 గజాల స్థలంలో తమకున్న స్థోమ బట్టి చిన్నపాటి గృహాలు నిర్మించుకున్నారు. దాదాపు 400 గృహాలు వెలిశాయి. కానీ ప్రభుత్వం ఈ కాలనీకి మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఎవరూ ఆ ఇం ఉండలేకపోతున్నారు.
అద్దె ఇండ్లలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నంబర్లు కేటాయిస్తామని గత ప్రభుత్వంలో అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త ప్రభుత్వమైనా సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తుందని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.
కరెంటు లేదు.. నీళ్లు రావు
చాకలి ఐలమ్మ నగర్‌లో సొంత ఖర్చులతో పేదలు ఇండ్లను నిర్మించుకున్నా ఆ కాలనీకి కరెంటు సౌకర్యం కల్పించలేదు. మునిసిపల్ తాగునీటి పైపులైన్ లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నంబర్లు కేటాయిస్తే కరెంటు కనెక్షన్ వచ్చే అవకాశం ఉంది. తదనంతరం మునిసిపల్ ద్వారా తాగునీటి పైపులైన్, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎంతో మంది పేదలు అక్కడ నివాసముండే అవకాశముంది. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌తో పాటు రెవెన్యూ, మునిసిపల్ అధికారులు ఈ కాలనీని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. కానీ సమస్యల పరిష్కారంపై చొరవ చూపడం లేదు.
కరెంటు, నీళ్ల సదుపాయం కల్పించాలి
ఎన్నో పోరాటాల ఫలితంగా నిరుపేదలకు ఇక్కడ స్థలాలు వచ్చాయి. అప్పోసప్పో తెచ్చి సొంతంగా చిన్నపాటి ఇండ్లు కూడా నిర్మించుకుం యు చాకలి ఐలమ్మ నగర్‌కు కరెంటు, నీటి సదుపాయం కల్పిస్తే ఎంతో మంది పేదలకు అద్దె ఇళ్ల బాధ తప్పుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి నంబర్లు కేటాయించి విద్యుత్, నీటి సదుపాయం కల్పించాలి.
కల్యాణం లింగం, ఇండ్ల సాధన సమితి అధ్యక్షుడు
ఇందిరమ్మ స్కీం కిందలోన్లు ఇవ్వాలి
దశాబ్దం కాలంగా ఎదురుచూసి చాకలి ఐలమ్మనగర్‌లో పేదలు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. చిన్నపాటి గదులు కట్టుకుని అందులో నివాసముండాలని తాపత్రయపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ప్లాట్లు ఉన్న వారికి రూ.5 లక్షల రుణం ఇచ్చేందుకు సర్వే చేస్తుంది. చాకలి ఐలమ్మ నగర్‌లో ఇల్లు కట్టుకుంటున్న పేదలకు కూడా ఈ పథకం వర్తింపజేయాలి.
జోగు ప్రకాశ్,
సీపీఎం పట్టణ కార్యదర్శి, జనగామ