కతువా దాడికి ముందు స్థానికులను బెదిరించిన ఉగ్రవాదులు
తదనంతరం భారత ఆర్మీ కాన్వాయ్‌లపై కాల్పులు
జమ్ము కశ్మీర్, జూలై 11 (విజయక్రాంతి): కతువా ప్రాంతలో సోమవారం దాడికి ముం దు స్థానికుల ఇళ్లలోకి చొరబడిన ఉగ్రవాదు లు తమ కోసం రుచికరమైన ఆహారం వండాలని వారి తలపై గన్ పెట్టి బెదిరించారని స మాచారం. దాడి చేసేటప్పుడు ఉగ్రవాదులు బాడీ కెమెరాలను ధరించి ఉన్నారు. భారత ఆర్మీ జవాన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రా ణాలు పోతున్నప్పటికీ ఆయుధాలు శత్రువుల చేతికి చిక్కకుండా ప్రతిదాడులు చేశారు. ఈ క్రమంలోనే ఐదుగురు జవాన్లు అమరులవ్వగా చాలామంది గాయపడ్డారు.
పక్కా ప్లాన్ ప్రకారమే..
పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడులకు గాను రోడ్డు కనెక్టివిటీ సరిగాలేని, ఆర్మీ స్థావరాలకు దూరంగా ఉండే ప్రాంతాలను ఎంచుకున్నా రు. అందుకే కతువా జిల్లాలోని మారుమూల గ్రామమైన బనోదా విలేజ్ ప్రధాన రహదారిని వారు సెలెక్ట్ చేసుకున్నారు.