calender_icon.png 11 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ రేట్లు పెంచబోమని.. పెంచేశారు!

11-01-2025 12:05:31 AM

ఎక్స్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): సినిమాలకు స్పెషల్ టికెట్ రేట్లు పెంచేది లేదు, అదనపు షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. రెండువారాలు తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

టికెట్ రేట్లు చెప్పిన మాట లన్నీ స్వల్ప వ్యవధిలోనే నీటిమూటలు అయ్యాయని ఆయన శుక్ర వారం ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీలో ప్రకటించిన దాని కే విలువ లేకపోతే ఎలా? అసెంబ్లీని సై తం తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోకి అనుమతి ఇవ్వ డం సభను అవమానించడమే అవుతుందన్నారు.

ఇందుకు ముఖ్య మంత్రి, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని తెలిపారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగారు. బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే సంధ్య థియేటర్ ఘటన జరిగిందని, దాన్ని మరువకముందే ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.