calender_icon.png 3 March, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దహన సంస్కారాలకు డబ్బులు లేవని..

01-02-2025 01:34:04 AM

  • ఎనిమిది రోజులుగా తల్లి మృతదేహంతోనే గడిపిన కూతుళ్లు
  • లష్కర్‌లో హృదయ విదారక ఘటన

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): గుండెపోటుతో చనిపోయిన తమ తల్లి మృతదేహానికి దహన సంస్కారా  నిర్వహించడానికి డబ్బులు లేక దాదాపు 8రోజుల పాటు తల్లి మృతదేహంతోనే ఇద్దరు కూతుళ్లు గడిపన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సికింద్రాబాద్ వారాసిగూడ బౌద్ధ నగర్‌లో నివాసముండే లలిత (45)కు ఇద్దరు కూతుళ్లు.

కరోనా సమయంలో ఆమె భర్త వారిని వదిలి ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో కూతుళ్ల బా  తల్లే చూసుకుంటోంది. కొంతకాలం క్రి  లలిత అనారోగ్యానికి గురికావడంతో చికిత్స చే   డబ్బు  లేక ఇంట్లోనే ఉంటోంది. ఈనెల 23న ఆరోగ్యం విషమించి లలిత చనిపోవ  కూతుళ్లిద్దరూ డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

లలిత దహన కార్యక్రమాలకు ఆమె కూతుళ్ల వద్ద డబ్బులు లేకపోవడంతో ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. వారి ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా లలిత మృతి చెంది ఉంది. ఆమె మృతదేహంతోనే వారు ఏకం  8 రోజులు గడిపినట్లు సమాచారం. లలిత మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.