* సంస్కరణల దిశగా సావిత్రి బాయి పూలే సేవలు
* ఫూలే దంపతుల స్ఫూర్తితో పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన
* ఫూలేకు నివాళి అర్పించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక సం ప్రదాయ నిర్భంధాలను బద్దలుకొట్టి, బడుగుల అభ్యున్నతికి, మహిళ విద్య కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
చదువుల తల్లి సావి త్రీ బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చేసిన సామాజిక కృషిని మహాత్మా జ్యోతిరావు సావిత్రి బాయి ఫూలే దంపతుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటనల విడుదల చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మెజారిటీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి, వారి హక్కులు కాపాడేందుకు త్యాగాలు చేసిన ఫూలే దంపతులు ముందువరుసలో ఉంటారని తెలిపారు.
సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దళిత బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా, సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అనతికాలంలో కుదురుకున్నదని చెప్పారు. ఫూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా బీఆర్‌ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలను అందిస్తున్నదని పేర్కొన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రీ బాయి ఫూలే దంపతుల ఆశయాలు ఇమిడివున్నాయని స్పష్టంచేశారు.