calender_icon.png 20 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చగొట్టి బురద చల్లుతుండ్రు

17-03-2025 12:00:00 AM

రైతులకు స్పిన్గ్లర్లను అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి 

మహబూబ్ నగర్ మార్చి 16 (విజయ క్రాంతి) : ఏదో ఒకటి మాట్లాడి రైతులను రెచ్చగొట్టి బురద చల్లుతున్నారని ఇది కేవలం టిఆర్‌ఎస్ నేతలకే చెల్లుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్రలోని ఎంపీడీవో కార్యాలయంలో దేవరకద్ర, కౌకుంట్ల, సీసీ కుంట, భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట్ మండలాలకు చెందిన రైతులకు స్ప్రింక్లర్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి.  మధుసూదన్ రెడ్డి అందజేశారు.

గత డిసెంబర్ లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులతో IౄB సమావేశం నిర్వహించి యాసంగి పంటకు లెఫ్ట్ కెనాల్ ద్వారా పాత ఆయ కట్టు (21, 22) డిస్ట్రిబ్యూట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని, కొత్త ఆయకట్టు కు నీళ్లు ఇవ్వడానికి వీలుకాదని తెలిపారు. గత బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కొత్త ఆయకట్టు డోకూర్, మినిగొనిపల్లి కు రెండో పంటకు నీళ్లు ఇవ్వలేదని, షెడ్యూల్ ప్రకటించలేదన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, తప్పుడు ప్రచారం చేయిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వ్యవసాయం, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిని, వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తో నిరంతరం చర్చిస్తూ, రైతులు నీళ్లు ఇచ్చేందుకు నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు.  వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డితో చర్చించి నేడు నిజాలాపూర్ కు నీళ్లు ఇప్పించమన్నారు.

రైతుల పంటలు ఎండిపోకుండా నిరంతరం పనిచేస్తూ, అందులో భాగంగా  కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి, జూరాలకు నీళ్లు తీసుకువచ్చామ్మని పేర్కొన్నారు. జూరాల నుండి మోటార్ల ద్వారా ఫర్దిపూర్ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకురావడం జరిగిందన్నారు. కోయిల్ సాగర్ చరిత్రలోనే మొదటిసారి యాసంగి పంటకు నీళ్లు తీసుకువచ్చామని, ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేయడం పద్దతి కాదన్నారు.

దేశంలోనే వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిదని, రూ 21 వేల. కోట్లతో 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం, 75% సబ్సిడీతో రైతులకు స్ప్రింక్లర్లను ఇస్తునన్నామని తెలిపారు.

గతం లో సబ్సిడీ ట్రాక్టర్ల పథకాన్ని తీసుకువచ్చి బిఆర్‌ఎస్ నాయకులు పంచుకున్నారని, రైతుల ఇబ్బందులు ముందే తెలుసుకుని 100 ట్రాన్స్ ఫరమ్స్ ఇచ్చామని తెలిపారు. రైతుల ఇబ్బందులు ఎక్కడ ఉంటే అక్కడ రైతుల అండగా జియంఆర్ ఉంటాడని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.