calender_icon.png 12 February, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైలా చూసి వావ్ అంటారు

12-02-2025 12:43:22 AM

విశ్వక్‌సేన్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టునర్ ‘లైలా’. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ నారాయణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

లైలా ఐడియా ఎప్పుడు వచ్చింది ? 

-బట్టల రామస్వామి బయోపిక్ తర్వాత ఓ యూనిక్ కథ చేయాలనుకున్నాను. హీరో లేడి గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. ఈ మధ్య అలాంటి కథలు రాలేదు.  క్యారెక్టరైజేషన్ కుదిరితే అద్భుతంగా వస్తుంది. బ్యూటీ పార్లర్‌లో పని చేసే మేల్ క్యారెక్టర్‌ని పెడితే లాజికల్‌గా జస్టిఫికేషన్ వస్తుందనే ఆలోచన కథ రాయడం మొదలుపెట్టాను. విశ్వక్‌సేన్ లేడీ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నారు. 

ట్రైలర్ చూస్తే బోల్డ్ నెస్ 

ఎక్కువైయిందని అనిపిస్తోంది? 

-ఇందులో వల్గారిటీ ఉండదు. నాటీనెస్ ఉంటుంది. ఈ కథకు ఆ నాటీనెస్ కావాలి. విజువల్‌గా సినిమా చాలా క్లీన్ గా ఉంటుంది. లేడి గెటప్ కోసం వర్క్ ఎలా చేశారు ? 

-లేడి గెటప్ అంటే మాకూ భయమే. అయితే రెమో సినిమాకి ప్రోస్తటిక్ చేసిన నిక్కీ ని సంప్రదించాం. విశ్వక్ లేడి గెటప్‌లో అదిరిపోతారని నిక్కీ చెప్పడంతో మాకు ఇంకా నమ్మకం వచ్చింది. 

ఇందులో విశ్వక్ పాటలు రాశారా?

-అవును. ఆయన లిరిక్స్ కూడా రాస్తారని నాకు తెలీదు. ట్యూన్ పంపిన తర్వాత తను ఓ పాట వినిపించారు. ఎవరు రాశారని అడిగితే తనేనని చెప్పారు. తను అప్పటికప్పుడే రాసేస్తాడు. 

కామాక్షి క్యారెక్టర్ గురించి ? 

-మేము ఇంకా ఆ క్యారెక్టర్ రివీల్ చేయలేదు. చాలా స్పెషల్ క్యారెక్టర్. సినిమా చూసి ‘వావ్’ అంటారు. అద్భుతంగా నటించారు. 

లైలా టైటిల్ గురించి ? 

-ఇందులో సోను మోడల్ లైలా.. ఈ రెండు క్యారెక్టర్స్ పై కథ నడుస్తుంది. లైలా గెటప్‌లో విశ్వక్ చూసి వారి ఫ్యామిలీ చాలా సర్ ప్రైజ్ అయ్యారు. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వస్తుంది.  

నిర్మాత సాహు గారి గురించి ?

-ఈ సినిమాకి సాహుగారు మెయిన్ పిల్లర్. ఆయన వలనే సినిమా ముందుకు వెళ్ళింది. కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. ఆయన ద్వారానే విశ్వక్ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. 

నటనపై మీకు ఆసక్తి ఉందా ? 

-ప్రస్తుతానికి దర్శకత్వంపైనే నా దృష్టి వుంది. నిజానికి మ్యూజిక్ డైరెక్టర్  అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను.