13-03-2025 02:13:08 AM
బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గవర్నర్ ప్రసంగంపై ఆయన మాట్లాడా రు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ సర్కారు చేయని పనులను చేసినట్లు చెప్పారని ఎద్దేవా చేశారు.
ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేశామని అబద్ధాలు చెప్పారన్నారు. గత బడ్జెట్‌లో బీసీలకు 20శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ విమర్శించారు. మహిళలకు ఇస్తానని తులం బంగారం ఏదని నిలదీశారు.