calender_icon.png 26 October, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

‘బఘీర’లా ఊహించుకుంటారు

23-10-2024 12:00:00 AM

ఉగ్రమ్ ఫేమ్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ కథ అందించగా, డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రుక్మిణి వసంత్, ప్రకాశ్‌రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా హీరో శ్రీమురళి మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా  సమావేశమయ్యారు. ఆయన చెప్పిన సినిమా విశేషాలివీ.. 

* ప్రశాంత్ నీల్ నా కెరీర్‌లో ఉగ్రం లాంటి గొప్ప సినిమా ఇచ్చారు. ఆ మూవీ టైంలో మేం చాలా క్లోజ్ అయ్యాం. ఆయనే ‘బఘీర’ స్టోరీ ఇచ్చారు. 

* ప్రశాంత్ నీల్ స్టోరీని డైరెక్టర్ సూరి  వందశాతం అద్భుతంగా స్క్రీన్ మీదకు  తీసుకొచ్చారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్. 

* ఈ క్యారెక్టర్ కోసం మూడేళ్లు జిమ్ ట్రైనింగ్ తీసుకున్నాను. క్యారెక్టర్ అలాంటిది. నేను నిజానికి ఫుడ్ లవర్‌ని. మటన్, రైస్ అన్నీ ఇష్టంగా తింటా. బిర్యానీ అంటే పిచ్చి. కానీ ఈ మూడేళ్లు చాలా కష్టంగా గడిచింది. చాలా స్ట్రిక్ట్‌గా లిక్విడ్ డైట్ చేశాను. నా కెరీర్‌లో ఇది వెరీ డేరింగ్, ఛాలెంజింగ్ క్యారెక్టర్. షూటింగ్‌లో గాయపడ్డాను. అలా జరగడం కామన్. అయితే నాకు నా సినిమానే ముఖ్యం. అందుకే నేను ఆ గాయాల గురించి పట్టించుకోలేదు. 

* ప్రతి ఒక్కరిలో హీరో ఉంటారు.. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ‘బఘీర’ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ‘బఘీర’లా ఫీల్ అవుతారని నమ్ముకున్నా. దేశమంతా చూడదగ్గ సినిమా ఇది. ఆ నమ్మకంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం.  

* ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది. -ఫెంటాస్టిక్ జర్నీ. నా సినిమాలన్నీ ఇష్టపడి చేశాను. ఇంకా బెటర్ మూవీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ జర్నీలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. -కథ బావుండి, కథలో నా క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటే మల్టీ స్టారర్స్‌లో పార్ట్ అవడం నాకు ఇష్టమే.