25-03-2025 12:00:00 AM
గుర్తుందిగా మన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ సాంగ్ 2023లో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం?! ఆ అవార్డు ప్రదానోత్సవ వేదికపైనుంచి ‘డు యూ నో నాటు?’ అంటూ ఆ పాటను పరిచయం చేసిందెవరో కాదు బాలీవుడ్ నటి దీపికా పదుకొణెనే. అయితే, తాజాగా ఆమె ఆస్కార్ అవార్డుల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఈ మేరకు తన ఇన్‌స్టాలో దీపిక ఓ వీడియోను పంచుకున్నారు. “మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకున్నారు. ఇలా చాలాసార్లు జరిగింది. మన దేశంలో ఎంతోమంతి ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటులకు గుర్తింపు దక్కలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ పాటకు ఆస్కార్ ప్రకటించినప్పుడు నేను అక్కడే ప్రేక్షకుల మధ్య కూర్చొని ఉన్నాను.
ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యా. వాస్తవానికి ఆ సినిమాతో నాకెలాంటి సంబంధమూ లేదు. ఎందుకంటే ఆ చిత్రంలో నేను భాగం కాలేదు. కేవలం ఒక్క భారతీయు రాలిగా ఆ క్షణంలో వ్యక్తిగతంగా ఎంతో ఆనందపడ్డా. ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలవి. ఇటీవల ౨ది బ్రూటలిస్ట్’ సినిమాకు గానూ ఈ ఏడాది అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ సొంతం చేసుకున్నందుకు నేను హ్యాపీగా ఫీలయ్యా” అని చెప్పుకొచ్చారు దీపిక.