దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ జనవరి 21 (విజయ క్రాంతి) : అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నచింతకుంట మండలంలోని లాల్కోట, అడ్డాకుల మండలంలోని కందూర్ గ్రామాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందుల గురి చేసిందని అసహనం వ్యక్తం చేశారు.
దేవరకద్ర నియోజకవర్గం లో కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముందస్తు ఆలోచన లేకపోవడంతో దేవరకద్రలో నిర్మించిన బ్రిడ్జి వల్ల దేవరకద్ర రెండుగా చీలిపోయిందని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు రైలు అధికారులను కోరడం జరిగిందని తెలిపారు.
ఇప్పటికే దేవరకద్ర మున్సిపాలిటీ తో పాటు, డిగ్రీ కాలేజ్, సీసీ కుంట మండలంలో ఇంటర్ కాలేజ్ తోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలియజేశారు. మునుముందు దేవరకద్ర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.