calender_icon.png 20 October, 2024 | 2:16 PM

నా మనసులో వాళ్లది గొప్ప స్థానం!

29-07-2024 12:05:00 AM

నేషనల్ క్రష్.. అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు రష్మిక మందన్న. ఈ అమ్మడు యావత్తు భారతీయ సినీ అభిమానుల గుండెల్లో నేషనల్ క్రష్‌గా తిష్ట వేయడం వెనుక ఆమె పడిన శ్రమేనని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, బాలీవుడ్ మూవీ ‘యానిమల్’లో ఆమె నటనకు దక్కిన ప్రశంసలే నిదర్శనం. ఒక్క నటనలోనే కాదు.. ప్రాంతాలతో సంబంధాలను కలుపుకోవటం, తనను అభిమానించే మనుషుల గుండె ఉప్పొంగేలా చేయటంలో ఆమెకు ఆమే సాటి అంటే నమ్మండి! ఈ భామ ఇటీవల వెళ్లివచ్చిన కేరళ టూర్‌లో తనకు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు మరి! ఆ రాష్ట్రంలోని కరునాడపల్లిలో నిర్వహించిన ఓ ప్రారంభోత్సవంలో రష్మిక పాల్గొన్నది.

తన కోసం భారీ సంఖ్యలో జనం తరలిరావటం, గొప్పగా స్వాగతం పలుకటం చూసి ఒకింత సంభ్రమా శ్చర్యానికి గురైందీ కన్నడ కుట్టి. కర్ణాటక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సొగసరి ఈ కార్యక్రమంలో వేదికపై అప్రయత్నంగా మళయాలంలో ప్రసం గించింది.. ఆకుపచ్చ చీరలో ఆద్యంతం ముఖంపై చెరగని నవ్వుతో కనిపించింది. కరునాడపల్లి విశేషాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. “కరునాడపల్లి చూపిన ప్రేమ మరిచిపోలేనిది. అంతటి అభిమానం చూపిన వాళ్లకు తన మనసులో గొప్ప స్థానం ఇస్తాను” అని రాసుకొచ్చింది రష్మిక.