- ఏడాదిలో రూ.70 వేల కోట్లు వడ్డీలే కడుతున్నాం
- ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్, జనవరి 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పేదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించి అప్పుల చిప్పగా తమ చేతికి ఇచ్చిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమా ణ స్వీకారం, మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. గత 60 ఏళ్లలో కేవలం రూ.65 వేల కోట్లు అప్పు దాటలేదని కానీ పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ.6,500 కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డకు కూ డా అప్పులు జతకట్టారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు ఏడాదిలో ఇప్పటివరకు రూ.70వేల కోట్లు వడ్డీ కట్టినట్లు తెలిపారు. ఈ దుర్భర పరిస్థితిలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు భూకబ్జాలు, ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని ఆరోపించారు. గ్రంథాలయ చైర్మన్‌గా గంగపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రమణారా వు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామంలో పాఠశాలను మంత్రి పున:ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు.