calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టు పట్టారు... సాధించారు

27-03-2025 12:00:00 AM

  1. కొత్తగూడెం కార్పొరేషన్‌కి అసెంబ్లీ ఆమోదం 
  2. గెజిట్ రావడమే తరువాయి 
  3. మారనున్న కొత్తగూడెం పాల్వంచ రూపురేఖలు 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 25 (విజయక్రాంతి): పట్టు పట్టారు... అనుకున్నది సాధించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ ఆమోదం రావడమే తరువాయి. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండ లంలోని నాన్ ఏజెన్సీ ప్రాంతాలైన ఏడు పంచాయతీలను (సుజాతనగర్, నర్సింహాసాగర్, కోమటిపల్లి, నిమ్మలగూడెం ,లక్ష్మీదే వి పల్లి, మంగపేట) కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు సోమవారం అసెంబ్లీలో ఆమోదం లభించింది.

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ప్రజలకు ఇచ్చిన హామీని పట్టుపట్టి సాధించారని చెప్పవచ్చు. కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్తగూడం పా ల్వంచ జంటపటాలతో పాటు సుజాతనగర్ మండలం అభివృద్ధి పథంలో దూసుకెల్లడం తజ్జం అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు. 

పట్టు పట్టారు... సాధించారు 

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ అభ్యర్థి సాంబశివరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలను కలుపు తూ కార్పొరేషన్ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర తో ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో జంట పట్టణాల ప్రజలు అత్యధిక మెజార్టీతో పట్టం కట్టారు.

తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోను కార్పొరేష్ప డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్ర తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఎన్నికల ప్రచారంలోనూ వారి చేత ప్రజలకు హామీ ఇప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే సాంబశివరావు కొత్తగూడెం కార్పొరేషన్ పై కసరత్ చేపట్టి చివరకు అసెంబ్లీలో పాస్ చేయించారు. 

1.98,182 మంది జనాభా 

కొత్తగా ఏర్పాటు కానున్న కొత్తగూడెం కార్పొరేషన్ లో 1,98,182 మంది జనాభా ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 97,337, పాల్వంచ మున్సిపాలిటీలో 89, 721, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో 11,124 మంది జనాభా తో నూతన కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. విస్తీర్ణాన్ని పరిశీలిస్తే పాల్వంచ మున్సిపాలిటీ 40.80 చదరపు కిలోమీటర్లు, కొత్తగూడెం మున్సిపాలిటీ 15.87 చదరపు కిలోమీటర్లు, సుజాతనగర్ లోని ఏడు పంచాయతీలు 28.48 చదరపు కిలోమీటర్లు మొత్తం 85.22 చదరపు కిలోమీటర్ల వేస్తేనములో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. 

పాల్వంచకు ఎన్నికల కల:

పాల్వంచ పురపాలకంకు ఎన్నికలకు చెక్కు ముడి వీడినట్లైం ది. పంచాయతీ గా ఉన్న పాల్వంచను 1987లో పొరపాలకంగా మార్పు చేశారు. 1987, 1995లో రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించారు. అప్పటినుంచి గిరిజన చట్టాల అడ్డంకుతో పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలకు బ్రేక్ పడింది.

అంటే సుమారు 25 సంవత్సరాలుగా పాలకవర్గం లేక ప్రత్యేక అధికారుల పాలనలో పాల్వంచ మున్సిపాలిటీ కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పడ నున్న కార్పొరేషన్ తో ఎన్నికలపై ఉన్న చిక్కుముడి వీడినట్లైంది. ఇకనుంచి పాల్వంచ పట్టణ పౌరులకు ఓటు వేసే భాగ్యం లభించింది అని చెప్పవచ్చు.

మారనున్న రూపు రేఖలు:ఎమ్మెల్యే సాంబశివరావు 

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్ లోని ఏడు పంచాయతీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, కొత్త పరిశ్రమలకు అవకాశం రావడంతో పాటు వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సాంబశివరావు స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

మరోవైపు విమానాశ్రయం ఏర్పాటుతో ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు విడుదల కానున్నాయి. ఆర్థిక వనరులు పెరిగి ప్రజలకు మెరుగైన వసతుల కల్పన సులభతరం అవుతుందన్నారు. వ్యాపార రంగం అభివృద్ధి చెందే అవకాశం మెండగా ఉంటుందని కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరుగుతాయన్నారు.

కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుకు జిల్లా ఎమ్మెల్యేలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ఎమ్మెల్యే  ప్రత్యేక అభినందనలు తెలిపారు.