22-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): డీఎస్సీ నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగులు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, రెండు నెలలైనా వారికి రూపా యి జీతం ఇవ్వలేదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో అపాయింట్ అయిన వారికి కనీసం ఎంప్లాయ్ ఐడీలు కూడా ఇవ్వలేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 23తో వారి కాంట్రాక్ట్ ము గుస్తోందని, 24 నుంచి వారు మళ్లీ నిరుద్యోగులవుతారని, 1,390 మంది రోడ్డున పడనున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేని సీఎం విదేశీ పర్య టనలు, మంత్రులు హెలికాప్టర్ల కోసం, ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కో సం కొట్లాడుకుంటున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.