calender_icon.png 6 February, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండను తవ్వి ఎలుకను పట్టారు!

06-02-2025 12:36:45 AM

  1. తప్పులతడకగా బీసీ కులగణన పర్సంటేజీ 
  2. మండల్ కమిషన్‌లో 52, ఎస్కేఎస్‌లో 52 శాతం..
  3. కాంగ్రెస్ సర్కార్ సర్వేలో 46 శాతమేనా..?
  4. హిందూ బీసీలు, ముస్లిం బీసీలంటూ రాజ్యాంగ విరుద్ధ పదాలు
  5. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన సర్వే నివేదిక పూర్తిగా తప్పుల తడకగా, అసమగ్రంగా, అశాస్త్రీయంగా, వాస్తవ దూరంగా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రె స్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే చట్టరూపంలో తీసుకొచ్చి అమలుచేయాలన్నారు.

బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలపై కపట ప్రేమను ఒలకబోస్తూ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహ రించిందన్నారు. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని, బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు తీసుకున్న చర్యగానే దీన్ని భావిస్తామ న్నారు.

హిందూ బీసీలు, ముస్లిం బీసీ లు అంటూ రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడారని పేర్కొన్నారు. మండల్ కమిషన్‌లో 51శాతం, బీఆర్‌ఎస్ సమగ్రకుటుంబ సర్వేలో 52శాతం బీసీలున్నారని వెల్లడైందని.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు సర్వేలో ఈ సంఖ్య 46 శాతానికి ఎలా తగ్గిందని ప్రశ్నించారు.

12శాతం ముస్లింల జనాభాను చూపిస్తూ.. ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని పేర్కొనడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. డా బీఆర్ అంబేడ్కర్ మతపరమైన రిజర్వేషన్లు ఉండవని చెప్పి నా.. వీళ్లు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

బీసీ జనాభా ఎలా తగ్గుతుంది..

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల సంఖ్య పెరగాలని.. కానీ రాష్ట్రంలో బీసీలు కోటి 60 లక్షల మందే ఉన్నారని చెప్పడం నమ్మశక్యంగా లేదని లక్ష్మణ్  విమర్శించారు. దాదాపు 90శాతం ముస్లింలు బీసీలు అని చెప్పడం సిగ్గుచేటన్నారు. మండల్ కమిషన్ రెండు తెగలను మాత్రమే బీసీలు అని చెబితే... కాంగ్రెస్ సర్కారు దీన్ని 90శాతానికి పెంచడం దుర్మార్గమన్నారు.

కేసీఆర్ ఒక్కరోజు సర్వేతో తడిగుడ్డతో గొంతుకోస్తే.. రేవంత్ 50 రోజుల పాటూ రోజూ పొడిచి పొడిచి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి బీసీలకు సరైన గౌరవం కల్పించింది మోదీ ప్రభుత్వమేనన్నారు.

బీసీలను మోసం చేశారు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టడం అత్యంత దారు ణమని లక్ష్మణ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు  నిర్ణయానికి అనుగుణం గా 50 శాతంలోపే రిజర్వేషన్లు ఉండాలని..

కానీ రాజశేఖర్‌రెడ్డి  సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు సంబంధించిన 14 కులాలను బీసీలుగా పరిగణిస్తూ బీసీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కట్టబెట్టారని గుర్తు చేశారు. ఇదంతా బీసీల ఓట్లను, బీసీల రిజర్వేషన్లను తగ్గించేందుకు జరిగిన కుట్రగా తెలిపారు.