calender_icon.png 28 November, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటా పెట్టరు.. వాన వదలదు

30-10-2024 01:40:42 AM

  1. కొనుగోళ్లు లేక ధాన్యం వర్షంపాలు 
  2. కామారెడ్డి జిల్లాలో అన్నదాతల అవస్థలు

కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తేమశాతం పేరుతో రైతులు కల్లాలకు తెచ్చిన ధాన్యం కాంటా పెట్టడం లేదు. తేమ పేరుతో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కొనడం లేదు. తేమశాతం తగ్గేందుకు కల్లాలోనే ధాన్యాన్ని అరబెట్టిన రైతులకు ఆకాల వర్షం ఆగం చేస్తోంది.

ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితులు రైతుల్లో నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కొనుగో ళ్లు చేయకపోవడం, కమ్ముకొస్తున్న మబ్బులతో గుబులు చెందుతున్నారు. తేమ పోవా లని ఆరబోయడం, మబ్బు రావడంతో కుప్ప చేయడం పరిపాటిగా మారిందని రామారెడ్డి గ్రామానికి చెందిన రైతు నర్సిం లు ‘విజయక్రాంతి’తో వాపోయారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రు. రైతుల పరిస్థితిని ప్రజాప్రతినిధులు, అధికారులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి చూడాలని కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.