14-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) ః 14 నెలల పరిపాల నలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలను ధ్వంసం చేసిందని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏ ఒక్క రంగం వారు కూడా సంతృప్తిగా లేరు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకు న్నాము అంటూ బాధపడుతున్నారని అన్నారు.
హైదరాబాదు నుండి జనగాం కి వెళ్తూ భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడా రు. ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖ ల మం త్రులు కొనసాగుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలు ఉండడం సిగ్గు చేటు అన్నారు. గత టిఆర్‌ఎస్ పాలనలో కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించామన్నారు.
కోతల కారణంగా పంట పొలాలు ఎండి రైతన్నలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ గారి హయాంలో కాళేశ్వరం ద్వారా ఆలేరుకు గోదావరి జలాలు అందించారు.. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీరు అందించా రు అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పర్సంటేజీలు కమిషన్లపై దృష్టి కేంద్రీ కరించారు... దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకుని ప్రజాసేవ మరిచారు అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై ముం దుకు పోయేలా పోరాటం చేసింది మన బీఆర్‌ఎస్ పార్టీ. ఇది మన బీసీ బిడ్డల విజయం.
బీసీ రిజర్వేషన్లపై కూడా కాం గ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోవాలి.. విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వేర్వేరు బిల్లు ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కల్పిం చాలి అని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మా ణాత్మకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోతుంది అని హెచ్చ రించారు.
రాజకీయాలలో బీసీలకు 42% విద్య, ఉద్యోగాలలో 46% రిజర్వేషన్లు అమలు చేయాలని. ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీ చేయొద్దని చట్టాన్ని రద్దు చేయాలన్నారు. యాదాద్రి జిల్లాలో చాలా మంది గురుకుల విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుం టున్నారు.. రోజుకో చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవుతున్నాయి.. అయినా ప్రభుత్వంలో చలనం లేదు..
ప్రభుత్వ బడులను పట్టించుకునే వారు లేక శిధిలైమైపోతున్నాయి.. రాష్ర్టంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా సీఎం రేవంత్ వణికిపోతున్నారు.... మా బీఆర్ ఎస్ కార్యకర్తలపై అక్రమ పెట్టి వేదిస్తున్నా రు అని మండిపడ్డారు. విలేకరుల సమావే శంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయ కులు శ్యామ మల్లేశం పాల్గొన్నారు.