calender_icon.png 4 February, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇస్తామని మోసం చేశారు

04-02-2025 12:00:00 AM

సినిమాలో అవకాశం దక్కించుకోవాలంటే ఎన్నో కష్ట నష్టాలను, మోసాలను అవమానాలను భరించాల్సి ఉంటుంది. ఆ కష్టాలన్నీ తాను పడ్డానని.. దాదాపు రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని నిధి అగర్వాల్ చెబుతోంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. “దీపికా పదుకొణె స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. మొదట ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నా సినిమా పిచ్చి చూసి నాన్నగారే ప్రోత్సహించారు. సినిమా ఛాన్సులు దక్కించుకోవడం అంత సులువేమీ కాదు.

రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిరిగా. కొంతమంది అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు. చివరి గా మైఖేల్ మున్నా ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. అలా నాగచైతన్య ‘సవ్యసాచి’లో అవకాశం వచ్చింది. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించడానికి కారణం ‘హరి హర వీరమల్లు’ అగ్రిమెంట్. ఆ సినిమా పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడటంతో వాళ్ల పర్మిషన్ తీసుకుని ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నా” అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.