calender_icon.png 27 December, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్టులతో తమ పోరాటాన్ని అడ్డుకోలేరు

01-12-2024 10:59:01 PM

గురుకులాల సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత పర్వేజ్ అరెస్ట్... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం ఎక్కడి న్యాయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పర్వేజ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మావల పరిధిలోని బీసీ గురుకుల పాఠశాలను సందర్శించడానికి ఆదివారం పాఠశాలకు వెళ్లిన ఆయన్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, మావల పోలీసు స్టేషన్ కు తరలించారు. గురుకుల పాఠశాలను సందర్శించడానికి ఎలాంటి అనుమతులు లేవని ఆయనను అడ్డుకున్నారు. అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్వీ పార్టీ కార్యకర్తలు స్టేషన్ కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకున్ని ముందస్తు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు శివకుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గురుకులాల బాట చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నాయకుల గొంతును నొక్కుతోందని మండిపడ్డారు.