- ఎల్బీనగర్‌లో సెల్లార్ కూలి ముగ్గురు కూలీలు దుర్మరణం
- పైనుంచి భారీగా మట్టి కూలడంతో అక్కడికక్కడే మృతి
- తీవ్ర గాయాలైన మరోకూలీకి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
- మృతుల్లో తండ్రీకొడుకు, బంధువు
- ఉపాధి కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కుటుంబం
ఎల్బీనగర్, ఫిబ్రవరి 5: బహుళ అంతస్తుల భవన నిర్మాణ సెల్లార్‌లో కూలీలు పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా మట్టికూలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉపాధి కోసం కన్నఊరి ని వదిలి హైదరాబాద్‌కు వచ్చి, మట్టి పను లు చేస్తూ అదే మట్టికింద పడి ప్రాణాలను కోల్పోవడం పలువురిని కలిచివేసింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన అలకుంట్ల వీరయ్య తన ఇద్దరు కుమారులు రాము, శ్రీనివాస్‌తోపాటు తన బావమరిది కృష్ణ కుమారులు శ్రీనివాస్ అలియాస్ వాసు, శ్రీధర్‌తో కలిసి ఆరేండ్ల కింద హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీకి ఉపాధి కోసం వచ్చా రు. మట్టితీత పనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఎల్బీనగర్‌లో ని చంద్రపురి కాలనీలో ఓ బహుళ అంతస్తు ల భవన నిర్మాణ పనుల్లో మట్టితీత పనుల కు ఆరుగురు కూలీలు వెళ్లారు. వీరిలో అలకుంట్ల వీరయ్య(48), వీరయ్య చిన్న కుమా రుడు రాము(19)తోపాటు వీరయ్య బావమరది కుమారుడు శ్రీనివాస్ అలియాస్ వాసు (17)తోపాటు మరో బంధువు భిక్షపతి (32) తో మరో ఇద్దరు కూలీలు ఉన్నారు.
సుమా రు 25 ఫీట్ల లోతులో సెల్లార్ పనులు చేస్తుండగా ఉదయం 10గంటల ప్రాంతంలో పైన ఉన్న మట్టి అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో అలకుంట్ల వీరయ్య, కుమారు డు రాము, అల్లుడు శ్రీనివాస్‌పై భారీస్థాయిలో మట్టి కూలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో నల్గొండ జిల్లా చిం తపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి అనే కూలీ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మరో ఇద్దరు ప్రమాదాన్ని చూసి పారిపోయారు.
సమాచారం తెలుసుకున్న మన్సారాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితోపాటు స్థానిక నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు వెంటనే స్పం దించి సహాయక చర్యలు చేపట్టారు. మట్టిలో కూరుకుపోయిన కూలీల మృతదేహాలను జేసీబీ యంత్రాల సాయంతో వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన భిక్షపతిని రక్షించి, స్థానికంగా ఉన్న కామినేని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుం బంలో ముగ్గురు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..
చంద్రపురి కాలనీలో జరిగిన ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాయపడి న వ్యక్తి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రమాద ఘటన విషయం తెలియగానే ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు.
నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్న భవన నిర్మాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, సరూర్‌నగర్ తహసీల్దార్ వేణుగోపాల్, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, సరూర్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్ సీఐలు సైదిరెడ్డి, వెంకటేశ్వర్లు, వినోద్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్యతోపాటు ఇతర అధికారుల ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.