20-03-2025 12:17:04 AM
సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఈ సినిమాను థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కేవై బాబు, భానుప్రకాశ్‌గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మించారు. ఈ సినిమా మార్చి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరి విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
పెళ్లికాని ప్రసాద్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
‘సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్ర మకుట దర గోవిందా’.. ఈ మూడు సినిమాలు కమర్షియల్ జోనర్‌లో మెప్పించే చిత్రాలు చేశాను. ప్రజలు 100% ఆదరించారు. ఫన్ జోనర్‌లో కామెడీకి మంచి స్కోప్ ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో పెళ్లి కాని ప్రసాద్ కథ వచ్చింది. స్క్రిప్ట్ విన్నాను చాలా నచ్చింది. చిన్నచిన్న డౌట్స్ ఉంటే మారుతి గారి వద్దకి తీసుకువెళ్లి వినిపించాము. ఆయన విని చాలా బాగుందని చెప్పి ఫస్ట్ కాపీతో రమ్మని చెప్పారు. ఆయన సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు.
టైటిల్ సెలక్షన్ ఎవరిది?
-డైరెక్టర్ గారిది. వెంకటేశ్ గారి కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాద్. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆ టైటిల్ వెయిట్‌ని కాపాడేలా ఉంటుంది సినిమా.
డైరెక్టర్ అభిలాష్ గురించి?
-అభిలాష్ చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. తను స్క్రిప్ట్ చెప్పినప్పుడే 70% డైలాగ్ వెర్షన్‌తో చెప్పాడు. ఒక కమెడియన్‌ని నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
ట్రైలర్ చూపించిన శాసనాల గ్రంథం గురించి చెప్పండి?
-ఇది చాలా ఫన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్. శాసనాల గ్రంథంలో కట్నాల గురించి తాత ముత్తాతల నుంచి ఆ గ్రంథంలో పొందుపరిచి ఉంటారు. కట్నం తీసుకోవడంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఆ గ్రంథంలో ఉంటాయి. అందులో ఉన్న రూల్స్ ప్రకారం కట్నం వస్తేనే పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ ఆసక్తికరంగా ఉంటుంది.
హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
హీరోని క్యారెక్టర్ ఇందులో చాలా డామినేటింగ్ ఉంటుంది. మా ఇద్దరి స్క్రీన్ స్పెషల్ ఈక్వల్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ సైడ్ నుంచి ఇందులో చాలా మంచి హ్యూమర్ జనరేట్ అవుతుంది.
ఈ సినిమాలో మెసేజ్ ఉంటుందా?
లేదండి. ఇది కేవలం ప్రేక్షకులు నవ్వుకోవడానికి చేసిన సినిమా. సినిమాలో స్క్రీన్ ప్లే, సిట్యువేషనల్ కామెడీ చాలా అద్భుతంగా కుదిరింది. సినిమా ఫుల్ ఫన్ రైడ్‌లా ఉంటుంది. నిర్మాతలు సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. పబ్లిసిటీని చాలా అద్భుతంగా చేశారు. 20న పెయిడ్ ప్రీమియర్స్ ఓపెన్ చేశాం. 70% సోల్డ్ అయ్యాయి. అది ఒక చాలా ఆనందాన్ని ఇచ్చింది.
మీరు వెంకటేశ్ గారిని రీప్లేస్ చేశారా?
-లేదండి. ఆయనొక గొప్ప నటుడు. జూనియర్ పెళ్లి కాని ప్రసాద్ అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నారు. పబ్లిసిటీ బాగా రీచ్ అయింది. వెంకటేశ్ గారు సీన్స్ చూసి కంటెంట్ చాలా పాజిటివ్‌గా ఉంది హిట్ కొట్టాలని బ్లెస్ చేశారు.
హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ?
-మంచి కథలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొత్త సినిమా వివరాలు చెబుతాను.