calender_icon.png 20 April, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రూట్ సలాడ్ తిని కవర్ మరిచిపోయారు

20-04-2025 08:19:23 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఇమ్రాన్ ఫ్రూట్ సలాడ్ సెంటర్ లో లక్ష రూపాయలు తీసుకుని దుండగులు పరార్ అయ్యారు. ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన బజార్ సాయిలు వరి పంట డబ్బులు తన బ్యాంకు ఖాతాలో జమ కాగా డబ్బులు తీసుకొని ఇమ్రాన్ ఫ్రూట్ సలాడ్ సెంటర్ లోకి వెళ్ళి డబ్బుల కవర్ దగ్గర పెట్టుకొని ఫ్రూట్ సలాడ్ తిని కవర్ మరిచిపోయాడు. జ్ఞాపకం రాగానే 10 నిమిషాలలోపే తిరిగి వచ్చే లోపే ఇద్దరు యువకులు డబ్బుల కవరును తీసుకుని పరార్ అయ్యారు. దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. శనివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.