calender_icon.png 22 February, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లు దోచుకెళ్తుంటే చూస్తూ ఉన్నారు!

22-02-2025 12:33:27 AM

  1. న్యాయమైన వాటా కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి
  2. మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగునీటి విషయంలో తెలంగాణకు జరు గుతున్న అన్యాయంపై మాట్లాడకుండా ఉత్తిమాటలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టులు కడితే దాదాపు 196 కేసులు పెట్టిన నీచమైన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు.

పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వానికి కృష్ణా, గోదావరి జలాల కేటాయింపుపై పలుమార్లు కేసీఆర్ వినతిపత్రాలు ఇచ్చారని, రెండు, మూడు నెలల్లో తేల్చాల్సిన నీటివాటాను నానబెట్టుకుంటువచ్చారని ఆరోపించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నీటి ఎందుకు మౌనం గా ఉన్నారని ప్రశ్నించారు.

నాగార్జునసాగర్ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే సీఎం రేవం త్‌రెడ్డి చేతులు కట్టుకుని కూర్చోవడం ఎంత వర కు కరెక్ట్ అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల వాటాకు రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా చేయాలని, అందుకు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.