calender_icon.png 24 October, 2024 | 1:54 PM

రాజకీయాల కోసమే ‘సెప్టెంబర్ 17’ను వాడుకుంటున్రు

18-09-2024 01:10:31 AM

పనికిమాలిన మాటలతో సీఎం రేవంత్ నవ్వులపాలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాం తి): రాష్ట్రంలో కొంతమంది నేతలు సెప్టెంబ ర్ 17ను రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గడిచిన పదేండ్లలో తెలంగాణలో శాంతిభద్రతలకు లోటురాకుండా కేసీఆర్ పాలన అందించారన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలకు తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని, కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టు కొని 9 నెలలు టైమ్ వృథా చేశారని మండిపడ్డారు. 

అన్నదాతలకు వెంటనే రైతు భరో సా డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాల ని కోరారు. పోలీసుల వాహనాలకు పెట్రో ల్, స్కూళ్లలో చాక్‌పీస్‌లు లేని పరిస్థితి నెలకొందన్నారు. సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టామని అడిగితే.. అధిష్ఠా నం మెప్పు కోసమే రాజీవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఆయన తెలివితక్కువతనం బయటపడిందన్నారు. రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని, చికున్‌గున్యా, విష జ్వరాలు, డెంగీలతో జనం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి ప్రతిష్ఠాత్మక పథకాలను పక్కన బెట్టారని అన్నారు. కనీసం పల్లెలో దోమల పిచికారీకి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉంటే వాటిని పక్కనబెట్టి కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని, అసలు రాష్ట్రంలో పాలనే లేదని మండిపడ్డారు.

గురుకుల టీచర్లను తొలగి స్తూ నాణ్యమైన విద్య అందకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హమీలను అమలు చేసేవరకు వెంబడిస్తామన్నారు. తెలంగాణ తల్లిని అవమానించి అక్కడ రాజీ వ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీ వ్ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామన్నా రు. రేవంత్‌రెడ్డికి రాజీవ్‌పై అంత ఇష్టముంటే జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఆయన విగ్రహం పెట్టుకోవాలన్నారు.