calender_icon.png 27 December, 2024 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటి గుట్టు విప్పేసింది..

18-10-2024 12:04:27 AM

ఇద్దరు అగ్రహీరోల సరసన ఛాన్స్ కొట్టేయడమంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం అలాంటి అవకాశాన్ని దక్కించుకుంది నిధి అగర్వాల్. ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ సరసన, ‘రాజా సాబ్‘లో ప్రభాస్‌తో అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈ రెండు సినిమా అప్‌డేట్స్‌తో అభిమానుల్లో నిధి జోష్ నింపింది. సామాజిక మాధ్యమం వేదికగా ఈ రెండు చిత్రాల షూటింగ్ గుట్టును విప్పేశారు. “ఆర్టిస్టుల జీవితం సర్‌ప్రైజ్‌లతో కూడుకుని ఉంటుంది. కొన్ని ఆశీర్వాదాలు మరచిపోలేం. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు పాన్ ఇండియా చిత్రాలు హరి హర వీరమల్లు, రాజాసాబ్‌ల లో నటించడం మరచిపోలేని అనుభూతి. ఒకటి ఆంధ్రా, రెండోది తెలంగాణలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ రెండూ కచ్చితంగా మీ అందరికీ నచ్చడమే కాకుండా పండుగ వాతావరణాన్ని నింపుతాయి” అంటూ రాసుకొచ్చింది. హరిహర వీరమల్లు విజయవాడలో, రాజాసాబ్ తెలంగాణలో చిత్రీకరణ జరుపుకుం టున్నట్టు నిధి మాటలను బట్టి తెలుస్తోంది.