calender_icon.png 18 March, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువు ‘కొనలేక’ పోతున్నారు!

15-02-2025 12:00:00 AM

-ఐ.వి.మురళీకృష్ణ శర్మ

విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పరీక్షల కాలం వచ్చేసింది. ఒకవైపు పిల్లలకు పరీక్షల టెన్షన్ పెరుగుతుం టే, మరోవైపు వారి తల్లిదండ్రులలో మా త్రం టెన్షన్ రెండింతలవుతుంది. పిల్లల పరీక్షలతో పాటు, రాబోయే విద్యా సంవత్సరంలో ప్రత్యేకించి ప్రయివేట్ పాఠశాల ల్లో చెల్లించాల్సిన ఫీజులపై ఆందోళనతో పేరెంట్స్ ఇప్పటి నుండే సతమతమవుతున్నారు. ఈ టెన్షన్లు  ఏటా షరామామూలే అయినా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్ పాఠశాలల్లో  ఫీజుల నియంత్ర ణ కోసం ముందడుగు వేస్తుండడంతో పేరెంట్స్ కొంత ఆశాదృక్పథంతో ఉన్నా రు. ప్రయివేట్ పాఠశాలల్లో అడ్డూ అదుపు లేని ఫీజుల కట్టడి కోసం విద్యా కమిషన్ చేసిన సిఫార్సులను చట్టం రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందనే వార్తలు  కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

విజ్ఞానం, విలువల కంటే మార్కులకే ప్రాధాన్యితిస్తున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రయివేట్ స్కూళ్లకు ఆదరణ పెరి గింది. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ మరింత మెరుగ్గా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు, వారికి తామిచ్చే ప్రధానమైన ఆస్తి మంచిగా చదివించడమే అనే భావనతో ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొ ని కొన్ని ప్రయివేట్ పాఠశాలలు ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న సుమారు 11,500 ప్రయివేట్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్  ‘తెలంగాణ ప్రయివేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025’ పేరిట జనవరి 24న పలు సిఫా ర్సులతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ బిల్లును చట్టం చేయాలని ప్ర భుత్వ వర్గాలు యోచిస్తున్నట్టు వార్తలు రావడం స్వాగతించాల్సిన పరిణామం.

మౌలిక వసతులు లేమితో ఇరుకైన భ వనాల్లో, క్రీడా ప్రాంగణాలు లేకుండా తరగతి గదుల్లో పరిమితికి మించి విద్యార్థుల తో బోధన సాగిస్తున్న ప్రయివేట్ పాఠశాలల్లో విద్యావ్యవస వ్యాపార వస్తువుగా మారిన నేపథ్యంలో ఈ కమిషన్ అనేక సూచనలు చేసింది. పే స్కూల్స్, టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్, ఈ-టెక్నో, ఒలంపియాడ్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలను కట్టడి చేయడానికి విద్యా కమిషన్ క్షేత్రస్థాయిలో పలు విద్యా సంస్థల యాజమాన్యాలతో, పేరెంట్స్ కమిటీలతో, విద్యావేత్తలతో, నిపుణులతో చర్చించడమే కాక, ఇతర రాష్ట్రాల్లోని విధి విధానాలను కూడా పరిశీలించి ప్రభుత్వానికి విలువైన సూచనలను అందించింది. రాష్ట్రంలోని ప్ర యివేట్ విద్యాసంస్థలు వాటి స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుండి రూ.20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఈ కమిటీ దృష్టికి వచ్చింది. గతంలో ఫీజుల ని యంత్రణ కోసం ప్రభుత్వం జీవో జారీ చేసి నా న్యాయపరమైన సమస్యలతో ప్రక్రియ ఆగిపోవడంతో ప్రయివేట్ పాఠశాలల ఆగడాలకు అంతే లేకుండా పోయిందని, గతం లో తిరుపతిరావు కమిటీ సిఫార్సులను ప్ర యివేట్ పాఠశాలలు తుంగలో తొక్కుతు న్నా పర్యవేక్షణ కరువైందని, విద్యా కమిటీని బంధనలను విద్యా సంస్థలు అటకెక్కించినా అడిగే నాథుడే లేరని గుర్తించిన కమి షన్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసింది.

రెగ్యులేటరీ కమిషన్లు

తెలంగాణలో ప్రయివేట్ పాఠశాలలు అధికంగా వసూలు చేస్తున్న ఫీజుల ని యంత్రణకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక రెగ్యులేటరీ కమిషన్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక రెగ్యులేటరీ కమిషన్లు ఏర్పాటు చేసి వాటికి చట్టబద్ధత కల్పించాలనే ప్రధానమై న సిఫార్సు చేసింది. రాష్ట్ర స్థాయి కమిషన్ చైర్మన్‌గా సుప్రీం కోర్టు/హై కోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పింది. పాఠశాల యాజమా న్యాల ప్రతినిధులను, రిటైర్డ్  ప్రొఫెసర్లను, విద్యావేత్తలను, విద్యా శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉన్నతాధికారిని, ఒక చార్టెర్డ్ అకౌంటెంట్‌ను సభ్యులుగా నియమించా లి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని పాఠ శాలల ఫీజులను స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్, మిగత జిల్లాల్లో ఫీజుల ఖరారు కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎఫ్‌ఆర్‌సీ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించాలని కమిషన్ చెప్పింది.

ఐదు కేటగిరీలుగా విభజన

ప్రయివేట్ పాఠశాలలను 5 కేటగిరీలు గా విభజించి, వాటికి వేర్వేరు ఫీజులు ఖ రారు చేయాలని కమిషన్ సూచించింది. ఆయా పాఠశాలలకు ఉన్న స్థలం, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హా ళ్లు, క్రీడా స్థలం, ఇతర సౌకర్యాల ఆధారం గా కేటగిరీలు, ఫీజులు నిర్ధారించాలని కమిషన్ పేర్కొంది. ఖరారు చేసిన ఫీజుల వివ రాలను పాఠశాల వెబ్‌సైట్లలో పెట్టి అంతే తీసుకోవాలి. మేనేజ్‌మెంట్లు అడ్మిషన్ ఫీజులు వసూలు చేయకుండా, ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలని కీలకమై న సిఫార్సు చేసింది. ఎప్పటికప్పుడు ఫీజులకు సంబంధించిన ఆడిట్ నివేదికలను కూడా బహిర్గతం చేయాలని కమిషన్ కీలక సూచన చేసింది.

నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూ లు చేసే విద్యా సంస్థలపై వెంటనే విచారణ జరిపి మొదటిసారి రూ.లక్ష జరిమానా వి ధించాలి. రెండోసారి ఆ సంస్థ నుండి అదే తప్పిదం  పునరావృతమైతే రూ.2 లక్షలు, మూడోసారి రూ.5 లక్షల జరిమానా వే యాలి. అయినా మార్పు రాకపోతే ఆ పా ఠశాల అనుమతులను రద్దు చేయాలనే క ఠినమైన సిఫార్సులను కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. పాఠశాలలో ఉండే గ్రం థాలయం, ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్ సౌ కర్యాలతో పాటు టీచర్ల విద్యార్హతలు, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల నిర్వహణకు అయ్యే ఖర్చుల ఆ ధారంగా ఫీజులు ఉండాలని కమిషన్ స్ప ష్టం చేసింది. అధికంగా ఫీజులు వసూలు చేసే అంశమే కాకుండా విద్యా ప్రమాణాలను పరిరక్షించడం, ఉపాధ్యాయుల సా మర్థ్యం పెంపు, పాఠశాలలపై పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టడం, విద్యా హక్కు చట్టం అమలు వంటి అధికారాలను కూడా కమిటీలకు ఇవ్వాలని కమిషన్ సూచించింది.

ఇతర రాష్ట్రాలకన్నా ఇక్కడే ఎక్కువ

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రా ల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయివేట్ పాఠశాలలపై సరైన నిఘా లేకపోవడంతో ఫీజులపై కట్టడి లేకుండా పో యింది. ఉదాహరణకు దేశంలోని ఒక ప్ర ముఖ విద్యా సంస్థ ఉత్తరాది రాష్ట్రాల్లో వ సూలు చేసే ఫీజుల కంటే, హైదరాబాద్‌లోని తమ ఫ్రాంచైజీలలో అధిక ఫీజులు వసూలు చేస్త్తోంది. పిల్లల అడ్మిషన్ల కోసం ప్రయివేట్ స్కూళ్లకు వెళ్తే తల్లిదండ్రులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఇబ్బందులు పె ట్టే పద్దతికి స్వస్తి పలకాలి. ఇప్పటికే అధిక ఫీజుల నియంత్రణతో పాటు విద్యాసంస్థ ల్లో సంస్కరణల కోసం మధ్యప్రదేశ్, గుజ రాత్  ప్రభుత్వాలు చేసిన చట్టాలు సత్ఫలితాలిస్తుండడంతో వాటిని కూడా పరిగణ లోకి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి, సంస్కరణల కోసం 2024 జులైలో మం త్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీ తక్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి పలు చర్యలు చేపట్టింది. 

వ్యాపార వస్తువుగా విద్య

అందరికీ అందుబాటులో ఉండాల్సిన విద్య కార్పొరేటర్ల చేతిలో ఒక వ్యాపార వ స్తువుగా మారిపోవడం దురదృష్టకరం. ప్ర స్తుత పరిస్థితుల్లో చదువును కొనలేక, చదువుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద, మ ధ్య తరగతి వర్గాలకు ఉపశమనం కలిగించేలా ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజుల ని యంత్రణకు, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం రాష్ట్రంలో ప్రత్యేక చట్టం చేయా ల్సిన ఆవశ్యకత ఉంది. విద్యా కమిషన్ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి రా బోయే విద్యా సంవత్సరం ఆరంభం నాటి కే ఒక చట్టాన్ని తయారుచేస్తే  ప్రయివేట్ పాఠశాలల దాష్టీకాల నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విముక్తులవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యా శాఖ కూడా ఉండడంతో ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కట్టడికి, విద్యా వ్యవ స్థలో సంస్కరణలకు ఆయన ప్రత్యేక చొర వ తీసుకొని చట్టం రూపొందించి వీలైనంత త్వరగా అమలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు.