బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలే కారణం
ఐఎన్‌టీయూసీ నేత జనక్ ప్రసాద్
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కలిసి సింగరేణి సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేశాయని ఐఎన్‌టీయూసీ నేత జనక్ ప్రసాద్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో తెలంగాణలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని.. దానికి బీఆర్‌ఎస్ విధానాలే కారణమని ఫైర్ అయ్యారు. కొంగుబంగారంలాంటి సింగరేణి సంస్థ మూతపడేలా బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రపన్నాయని తెలిపారు. తమ రాజకీయ లబ్ధి కోసం సింగరేణిని నిట్టనిలువునా ముంచారని దుయ్యబట్టారు.