calender_icon.png 25 February, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతలకు ఆశీర్వచనం ఇచ్చేవారేరి!

25-02-2025 01:40:41 AM

యాదగిరిగుట్ట ఆలయ అధికారుల నిర్లిప్త ధోరణి

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): దాతల సహకారం లేనిదే ఏ దేవాలయం దేదీప్యమానం కాలేదు. ఇతిహాస పురాణాలలో సైతం స్వయంభువులుగా వెలసిన దేవదేవతల ఆలయాల కు ఆనాడు రాజులు, చక్రవర్తులు చేసిన వివిధ రకాల సేవా దాతృత్వాలతోనే అవి తరతరాలుగా చెక్కుచెదరకుండా, భవిష్యత్ తరాలకు దిక్సూచిగా నిలిచాయి. ఆలయ నిర్వాహకులు నేరపే సత్సంబంధాలతోనే దాతలు ఆలయాల అభి వృద్ధికి పాటుపడతారు.

కానీ నిర్వాహకుల రాజకీయాలు, నిర్లక్ష్యం కారణంగా దాతలు వెనుకడుగు వేసే పరిస్థితి వస్తుం ది. భగవంతుడిపై భక్తితో దాతలు ముం దుకు వచ్చినా, నిర్వాహకులు వారికి సరైన గౌరవం ఇవ్వడం లేదని నిరాశ నిస్పృహలు దాతలలో నెలకొంటున్నాయి. రెండవ తిరుపతిగా పేరుగాంచిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురం తయారుకావడానికి దాదాపు 300మంది భక్తులు విరా ళాలు ఇచ్చారు.

స్వర్ణ గోపురం ప్రారంభోత్సవానికి ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందో త్సాహాలతో దాతలు వారి కుటుంబ సభ్యులతో హాజరైనా నిర్వాహకులు వారిని తగినరీతిలో పట్టించుకోలేదు. 300 మంది దాతలలో కేవలం సగం మంది కూడా ఈ కార్యక్రమానికి  రాలే దు. వచ్చినవారికి కూడా కనీస మర్యాద ఇవ్వకుండా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారని దాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దాతల వాహనాలను కూడా పైకి అనుమతించకుండా యంత్రా ంగం అడ్డుకోవడంతో గోపుర ప్రారంభోత్సవంలో వారు పాల్గొనలేకపోయారు.

ఆలయ అధికారుల అడ్మినిస్ట్రేష న్ ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది. ముందే కొండపైకి చేరుకున్న దాతలకు విశ్రాంతి గదులు లేవు.. దర్శనం చేయించేవారు ఉండరు. ఏదో ఒక విధంగా దర్శనం చేసుకుంటే ఆశీర్వచనం చేయరు. తీర్థ ప్రసాదాలు ఇచ్చే వారు లేరు. అందరిదీ హడావుడి. దాతలు మాకు పట్టి లేరు అన్నట్లుగా  పూర్తి నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆలయ అధికారుల్లో కనిపించిందనే విమర్శలు విని పిస్తున్నాయి.

ప్రారంభోత్సవానికి వచ్చి న దాతల అందరిని ఒక వేదికపై కూ ర్చుండబెట్టి ఆశీర్వచనాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి, ముఖ్యమంత్రి, ఇతర అధికారులతో పరిచయాలు చేసి ఫోటోలు తీద్దాం అనే కనీస సంప్రదా యం అధికారుల్లో లేకపోవడం బాధాకరమని కొందరు దాతులు చెప్పారు. లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు విరాళాలు అందజేసి.. 80 కోట్లతో 68 కిలోల బంగారంతో దేశంలోని ఎత్తున తొలి స్వర్ణ తాపడం గోపురంగా చరిత్ర సృష్టించడానికి కారకులైన దాతలను ఆలయ అధికారులు విస్మరించడం శోచనీయం, విచా రకరమని అభిప్రాయపడుతున్నారు. అధికారులు తమ తీరును మార్చుకొని దాతలు పట్ల గౌరవ మర్యాదలు, సాంప్రదాయాలు పాటించకపోతే, భవిష్యత్తులో దాతలు ముందుకు రావాలంటే ఆలోచించే పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.