calender_icon.png 17 November, 2024 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్లు కొనకుండా ఇబ్బందులు చేస్తుండ్రు

17-11-2024 07:17:07 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో రైతులు పండించిన వారి ధాన్యం కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హాజీపూర్ మండలం పడ్తనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రాలకు వరి ధాన్యం తీసుకువచ్చి రెండు వారాలవుతున్నా కొనుగోలు చేయడం లేదని, తాలు ఉందని తిరిగి తూర్పారబట్టాలని కాలాయాపన చేస్తున్నారని, తూకం ఎక్కువ పెడితే కాంటా చేస్తామంటూ రైతులను దగా చేస్తున్నారని మండి పడ్డారు.

ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లలో మాట్లాడటం, కేంద్రాలను ఓపెన్ చేసి వదిలేయడం చేస్తున్నారే తప్ప ఇంత వరకు ఎంత మంది రైతుల ధాన్యం తూకం అయింది. ఎంత తూకం వేస్తున్నారనేది కొనుగోలు కేంద్రాలను తిరిగి రైతులను అడిగితే అసలు సమస్యలు తెలుస్తాయన్నారు. మరోవైపు రూ.2 లక్షల రుణమాఫీ అటే పోయిందని, పెట్టుబడి సాయం మాయమైందని, రూ.500 బోనస్ అసలు షురే కాలేదని, ఇలా రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిషన్ వచ్చా, మాధవరపు వెంకట రమణరావు, బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, గడ్డం స్వామి, సత్యనారాయణ, ప్రశాంత్, అంకం శ్రీనివాస్, హనుమాన్, బొడ్డు తిరుపతి, తిరుపతి, సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.