calender_icon.png 5 December, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నోళ్లే కాటికి పంపుతున్నరు!

05-12-2024 12:21:27 AM

  1. క్షణికావేశంలో పిల్లలతో కలిసి ఆత్మహత్యలు
  2. మూడు నెలల్లోనే నిజామాబాద్ జిల్లాలో నాలుగు ఘటనలు
  3. నలుగురు చిన్నారుల మృతి

కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): అభం, శుభం తెలియని చిన్నారులను అమ్మానాన్నలే చిదిమేస్తున్నారు. తల్లిదండ్రులు క్షణికావేశానికి లోనై తమ పిల్లలతో కలిసి ఆ త్మహత్యలకు పాల్పడుతుండటం బాధ కలిగించే అంశం.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో మూడు నెలల్లోనే నాలుగు ఘటనలు జరుగగా.. నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాక్రమాలను రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. 

ఇటీవల జరిగిన ఘటనలు

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బెట్టింగ్‌లకు అలవాటుపడి, చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తానూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 12 అక్టోబర్ 2024న చోటు చేసుకుంది.

నవంబర్ 25న నిజామాబాద్‌లోని న్యాల్‌కల్ చెరువులో  ఓ తండ్రి తన కూతురును చెరువులో తోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 17న సిద్దిపేటకు చెందిన భానుప్రియ తన ఇద్దరు పిల్లలుతో కలిసి చెరువులో ఆత్మహత్య చేసుకున్నది.