ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ఆదిలాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిని గత బీఆర్‌ఎస్ పాలకులు విస్మరించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుతం సైతం అదే బాటలో కొనసాగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. పాలకులు రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
సోమ వారం ఆయన ఆదిలాబాద్‌లో పర్యటించి, మీడియా సమావేశంలో మా ట్లాడారు. వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడానికి తన వం తు కృషి చేస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను ప్రభుతాలు మోసం చేస్తున్నాయని ధజ మెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గెలిచిన వంద రోజుల్లో గ్రామాల్లో ఉచిత విద్య, వై ద్యం అందిస్తామని హామీ ఇచ్చా రు. 75 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి తాను చేసి చూపిస్తానన్నారు.